జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఐచ్ఛికాలు ఎంత మాత్రం సమ్మతం కావని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు.
బీఆర్కే భవన్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీశ్ రావు... జీఎస్టీ పరిహారాన్ని పొందడం రాష్ట్రాల చట్టబద్ధహక్కు అని అన్నారు. కేంద్రం ఇచ్చిన రెండు ఐచ్చికాలు సమ్మతం కావన్న ఆయన... కేంద్రమే అప్పుగా తీసుకొని పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని కోరారు. తెలంగాణతో పాటు పశ్చిమబంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.