Harish Rao: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేక నైజాన్ని మరోసారి బయటపెట్టిందని ఆర్థిక శాఖా మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మోసపూరిత వైఖరితో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెంచుతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని అన్నారు. వంటగ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు గుదిబండగా మారాయని హరీశ్ రావు పేర్కొన్నారు. కరోనా సంక్షోభంతో ఆదాయం కోల్పోయిన ప్రజలను... అధిక ధరలు మరింత అప్పుల్లోకి, కష్టాల్లోకి నెట్టుతున్నాయని వ్యాఖ్యానించారు. రాయితీని భరించాల్సిన కేంద్రం.. వేలాది కోట్ల ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోందని ఆర్థిక శాఖా మంత్రి ఆరోపించారు.
ధరలు భారంగా మారాయి..