Harish Rao Comments on MBBS Seats : వైద్య విద్యలో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు బాగా పెరిగాయని.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యానికి చేరువవుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కొత్తగా 8 వైద్య కళాశాలలతో రాష్ట్రంలో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయన్న ఆయన.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు మార్కుల కటాఫ్ భారీగా తగ్గిందని తెలిపారు. 8.78 లక్షల నీట్ ర్యాంకుకూ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందన్న మంత్రి.. రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొందని హర్షం వ్యక్తం చేశారు.
వైద్య విద్యలో రాష్ట్ర విద్యార్థులకు అవకాశాలు బాగా పెరిగాయి: హరీశ్‌రావు - తెలంగాణ ఎంబీబీఎస్ సీట్ల కటాఫ్ మార్కులు
Harish Rao Comments on MBBS Seats : డాక్టర్ కావాలన్న విద్యార్థి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 8 వైద్య కళాశాలలతో అదనంగా 1,150 సీట్లు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు మార్కుల కటాఫ్ భారీగా తగ్గిందని వివరించారు.
Harishrao
రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి పెరగడంతో ఎస్టీ అభ్యర్థులకూ అవకాశాలు మెరుగైనట్లు హరీశ్‌రావు వివరించారు. బీ కేటగిరీలో 85 శాతం స్థానిక రిజర్వేషన్లతో రాష్ట్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని హరీశ్‌రావు తెలిపారు. డాక్టర్ కావాలన్న కలను రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు సాకారం చేస్తున్నాయని తెలిపారు. వైద్య సీట్లలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందన్న మంత్రి.. జనాభా ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లలో మొదటి స్థానంలో, పీజీ సీట్లలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: