ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేశామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పీఆర్సీ కమిషన్ నివేదికను పరిగణలోకి తీసుకుని.. 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించామని తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
త్వరలో 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు - minister Harish Rao latest news
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ.. ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు
రాష్ట్రంలో త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు
మెరుగైన ఆరోగ్య ప్రమాణాల దృష్ట్యా వయో పరిమితి పెంచినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉందని గుర్తు చేశారు. వయసు పెంపు వల్ల ఉద్యోగ ఖాళీలకు ఇబ్బంది లేదన్న మంత్రి.. ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఖాళీలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.