తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి' - minister harish rao about farmers in nabard meeting

వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి నాబార్డ్‌ సహకరించాలని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందుబాటులో ఉంచాలని నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో పేర్కొన్నారు.

minister harish rao about farmers in nabard meeting
'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'

By

Published : Jan 23, 2020, 3:54 PM IST

వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి జరిగితేనే... రైతుల ఆదాయం రెట్టింపు చేయడం సాధ్యమవుతుందని ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నాబార్డు రాష్ట్ర రుణ ప్రణాళిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

'వ్యవసాయాధారిత పరిశ్రమల అభివృద్ధికి సహకరించండి'
నాబార్డు 2020-21 ఏడాదికి సంబంధించిన 'స్టేట్ ఫోకస్ పేపర్'ను హరీశ్‌రావు ఆవిష్కరించారు. 'హైటెక్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టిసెస్‌'ను నాబార్డు ఈ ఏడాది లక్ష్యంగా ప్రకటించడాన్ని మంత్రి స్వాగతించించారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్‌లోనూ ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని హరీశ్‌రావు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details