తెలంగాణ

telangana

ETV Bharat / state

"నేను సగం మీసం తీయించుకుంటా.. నువ్వు సగం గడ్డం తీయించుకుంటావా"

MINISTER GUMMANURU SENSATIONAL COMMENTS ON CBN : ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి గుమ్మనూరు జయరాం హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం నేతలకు రుచిచూపిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.

"నేను సగం మీసం తీయించుకుంటా.. నువ్వు సగం గడ్డం తీయించుకుంటావా"
"నేను సగం మీసం తీయించుకుంటా.. నువ్వు సగం గడ్డం తీయించుకుంటావా"

By

Published : Nov 19, 2022, 8:22 PM IST

MINISTER GUMMANURU SENSATIONAL COMMENTS: ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చెయ్యలేడని.. బ్యాలెట్​ పేపర్​లో ఆయన పేరే ఉండదని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని సవాల్​ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్​కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామన్నారు.

"నేను సగం మీసం తీయించుకుంటా.. నువ్వు సగం గడ్డం తీయించుకుంటావా"

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details