MINISTER JAYARAM ON ITTINA LANDS :ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో ఇట్టినా కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఎవరివైనా ఉంటే.. వాటిని మార్కెట్ ధర ప్రకారం రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని.. కార్మిక శాఖ మంత్రి జయరాం ప్రకటించారు. ఆస్పరిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన మంత్రిని.. ఇట్టినా కంపెనీకి భూములు ఇచ్చిన రైతులు, సీపీఎం నాయకులు అడ్డుకునేందుకు యత్నించగా.. పోలీసులు నిలువరించారు.
అనంతరం అంబేడ్కర్ సర్కిల్‌లో జగన్ జన్మదినోత్సవాల్లో పాల్గొన్న జయరాం.. రైతులకు భూముల రిజిస్ట్రేషన్ ప్రతిపాదన చేశారు. ఐతే జయరాం కొన్న భూములను ఆదాయపు పన్నుశాఖ అటాచ్ చేసిందని, ఆ భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పడం ఏంటని సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు.