ఎల్బీ స్టేడియంలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. సభా ప్రాంగణానికి చేరుకునేందుకు మంత్రి గంగుల కమలాకర్ కార్యకర్తలతో కలిసి పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లారు.
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల - గ్రేటర్ ఎన్నికలు 2020 ప్రచారం
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరగనున్న సీఎం బహిరంగ సభకు మంత్రి గంగుల కమలాకర్ ర్యాలీగా వెళ్లారు. హిమాయత్‌నగర్ డివిజన్ అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.
సీఎం సభకు ర్యాలీగా వెళ్లిన మంత్రి గంగుల
హిమాయత్‌నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి హేమలత యాదవ్ ఆధ్వర్యంలో కింగ్ కోఠి నుంచి ఎల్బీ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీకి భారీసంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ ర్యాలీలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్ మేయర్ ఆనంద్‌రావు పాల్గొన్నారు. డప్పుల చప్పుళ్లతో మహిళలు, యువకులు పెద్దసంఖ్యలో సభాస్థలికి చేరుకున్నారు.