తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే ఆశించిన లక్ష్యాలు సాధ్యం' - తెలంగాణ న్యూస్​

స్వచ్ఛంద సంస్థల కృషితోనే వినియోగదారు హక్కుల పరిరక్షణ సాధ్యమని పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే ఇలాంటి బాధ్యతను నిర్వర్తిస్తే ఆశించిన ఫలితాలు రావని తెలిపారు. ఈ ఏడు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని సస్టైనబుల్ కన్స్యూమర్ థీమ్​తో జరుపుకుంటున్నామని వెల్లడించారు.

పౌరసరాఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula Kamalakar

By

Published : Dec 24, 2020, 9:21 AM IST

స్వచ్ఛంద సంస్థల కృషితోనే వినియోగదారు హక్కుల పరిరక్షణ సాధ్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఎటువంటి ఉద్యమం అయిన నిర్దేశించిన లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే ఇలాంటి బాధ్యతను నిర్వర్తిస్తే ఆశించిన ఫలితాలు రావని తెలిపారు.

ఇతర దేశాల వలే మన దేశంలో సైతం వినియోగదారుల హక్కులను రక్షించడం కోసం పలు సంఘాలు కృషి చేయవలసిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయడ్డారు. ఈఏడు జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని సస్టైనబుల్ కన్స్యూమర్ థీమ్​తో జరుపుకుంటున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details