రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు కంటోన్న బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అన్ని జిల్లాల బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. కేసీఆర్ ఆపద్బంధు పేరిట ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా యువతకు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
'కేసీఆర్ ఆపద్బంధు పేరిట యువతకు అంబులెన్స్‌లు' - Minister Gangula Kamalakar Latest news
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆపద్బంధు పేరిట ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా యువతకు అంబులెన్స్‌లు ఇవ్వనున్నారు. అన్ని జిల్లాల బీసీ సంక్షేమశాఖ అధికారులతో మంత్రి గంగుల కమలాకర్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పదివేలమంది నిరుపేద బీసీ మహిళలకు తగు శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందించాలని చెప్పారు. చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్ ద్వారా శిక్షణ ఇప్పించి జీవనోపాధి కల్పించాలని సూచించారు. రెగ్యులర్ ప్రాతిపదికన అన్ని జిల్లాల్లో సంక్షేమ అధికారులను నియమించాలని, అధికారులందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. ఇక నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించి హాస్టళ్లు, గురుకులాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇదీ చూడండి :'తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే...'