తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: గంగుల

రాష్ట్రంలో రైతుల సౌకర్యార్థం ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం 6 వేల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆ శాఖ అధికారులతో ‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: మంత్రి గంగుల
ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు: మంత్రి గంగుల

By

Published : Oct 8, 2020, 6:11 PM IST

వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఉన్నత స్థాయి సమీక్ష సమవేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొన్ని కేంద్రాల్లో మనుపటి మాదిరిగా కోవిడ్-19 నిబంధనలు విధిగా అమలు చేస్తామని మంత్రి కమలాకర్‌ ప్రకటించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లుగా... ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సాధ్యమైనంత త్వరితగతిన డబ్బు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్‌ మరింత అభివృద్ధి చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఎస్​ సోమేశ్ ​కుమార్​, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్ ‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'బీమా చెల్లించినా... రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదు'

ABOUT THE AUTHOR

...view details