రజక, నాయీబ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తులపై మంత్రి గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. నాయీబ్రాహ్మణులు, రజకులు కోరుతున్న పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా గతంలో ఇచ్చిన జీవో నంబర్2లో ఉచిత విద్యుత్... కమర్షియల్ కేటగిరిలో కాకుండా సేవా విభాగం కింద ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సెలూన్లకు లేబర్ లైసెన్స్ లేదా మున్సిపల్, గ్రామ పంచాయితీ లైసెన్సులు, రెంటల్ అగ్రిమెంట్ల నుంచి మినహాయించాలని, మూడు నెలల విద్యుత్ బిల్లుల అడ్వాన్స్ చెల్లింపుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు మంత్రిని గతంలో కోరారు. 250 యూనిట్లు దాటిన తర్వాత సైతం దోబీ ఘూట్లకు ఎల్.టీ 4 కింద కాకుండా యూనిట్‌కు రూ.2 చార్జి వర్తింపజేయాలని, సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్లకు వ్యక్తిగత ధ్రువీకరణతో అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
రజక, నాయీబ్రాహ్మణ సంఘాలకు నూతన విధివిధానాలు: గంగుల - తెలంగాణ తాజా వార్తలు
రజక, నాయిబ్రాహ్మణులకు నూతన విధివిధానాలను రూపొందిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సెలూన్లు, దోబీఘూట్లు, లాండ్రీలను సేవా కేటగిరి కింద పరిగణించాలని రజక, నాయిబ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
minister gangula kamalakar review
ఆయా సమస్యల పట్ల గతంలోనే సానుకూలంగా స్పందించిన మంత్రి... రజకుల, నాయీబ్రాహ్మణులు ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ఈరోజు ఉన్నతాధికారులతో చర్చించారు. గతంలో ఇచ్చిన నిబంధనలు తొలగించి నూతన విధానాల కోసం ఈనెల 11న ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో రజక, నాయీబ్రాహ్మణ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. అర్హులకే ఈ పథకం అందేలా జాగ్రత్త వహించాలని, అనర్హులఫై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.