తెలంగాణ

telangana

ETV Bharat / state

Gangula with Satake: 'సటాకే'తో మిల్లింగ్ ఇబ్బందులకు స్వస్తి: గంగుల - సటాకే ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్

ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో ఇబ్బందులను అధిగమించేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సటాకే ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటుపై మంత్రి వారితో చర్చించారు.

Minister gangula kamalakar
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

By

Published : Jul 12, 2021, 7:22 PM IST

ధాన్యం మిల్లింగ్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సటాకే ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్పెషల్ పుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయనున్న తరుణంలో తక్కువ ధరకే యంత్రాలు అందించేందుకు సటాకే యాజమాన్యం సంసిద్ధత వ్యక్తం చేసినట్లు మంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలోనే శిక్షణ, 24 గంటల సేవాకేంద్రాలు ఏర్పాటు అంశాలపై మంత్రితో చర్చించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల కర్ణాటకలో హైగ్రేడ్ మిల్లింగ్ సామర్థ్యం కలిగిన సటాకే యంత్రాలను మంత్రి గంగుల పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లుల కోసం సటాకే యంత్రాలు అందుబాటులో ఉంచడమే కాకుండా బహిరంగ మార్కెట్ కంటే 10 శాతం తక్కువ ధరకే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు.

రోజుకు 500 టన్నులకు పైగా మిల్లింగ్

అత్యాధునిక సాంకేతికత కలిగిన సటాకే యంత్రాలు గంటకు 21 టన్నుల సామర్థ్యంతో రోజుకు 500 టన్నులకు పైగా ధాన్యం మిల్లింగ్ చేయడం సహా.. ఊక నుంచి అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఏ క్లస్టర్‌లో ఏర్పాటయ్యే మిల్లులకు అక్కడే శిక్షణ, సేవాకేంద్రాలు నెలకొల్పుతామన్నారు. భారత ఉపఖండంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో తమ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుందని మంత్రికి వివరించారు.

అత్యధికం రాష్ట్రం నుంచే ఎఫ్​సీఐకి..

రాష్ట్రంలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి వస్తుందన్నందున సీఎంఆర్​ డెలివరీలో ఇబ్బంది అధిగమించేందుకు సటాకే యంత్రాలు బాగా ఉపయోగపడతామని మంత్రి గంగుల తెలిపారు. కాళేశ్వరం జలాలతో ప్రతీ ఏటా 3 కోట్ల టన్నులు పైగా ధాన్యం పండుతుందని మంత్రి అన్నారు. ఎఫ్‌సీఐ సేకరించే ధాన్యంలో అత్యధిక శాతం రాష్ట్రం నుంచే వెళ్తోందని గంగుల వెల్లడించారు. ధాన్యం దిగుబడి అనుగుణంగా సటాకే యంత్రాల సహాకారం చాలా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించి త్వరితగతిన సింగిల్ విండో విధానం కింద అనుమతులు ఇస్తామని వారికి మంత్రి వివరించారు. ఈ అవకాశాలను యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సటాకే కంపెనీ డైరెక్టర్ రాజిందర్ .కె బజాజ్, ఎజీఎం సతీష్‌కుమార్, ప్రతినిధులు విఠల్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Lower manair dam: రైతులకు గుడ్​ న్యూస్.. దిగువ మానేరు డ్యాం నుంచి నీరు విడుదల

ABOUT THE AUTHOR

...view details