తెలంగాణ

telangana

ETV Bharat / state

'బత్తాయి పండ్లు తినండి... కరోనాను తరిమికొట్టండి' - బత్తాయి పండ్ల వల్ల లాభాలు

రోగనిరోధక శక్తిని పెంచేందుకు బత్తాయి ఎంతో దోహద పడుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ముందుగా మనం మనోధైర్యంతో ఉండాలని పేర్కొన్నారు.

Minister Gangula Kamalakar Distributes Battayi Fruits to public in Karimnagar district
'బత్తాయి పండ్లు తినండి... కరోనాను తరిమికొట్టండి'

By

Published : May 10, 2020, 7:41 PM IST

కరీంనగర్ బస్టాండ్​లో బత్తాయి దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ పాల్గొని పేదలకు పండ్లు పంపిణీ చేశారు. బత్తాయి తినటం వల్ల కలిగే లాభాలను విడమర్చి చెప్పారు. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల రోజువారీ దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని నొక్కి చెప్పారు.

బత్తాయి పండ్లలో యాంటీ యాక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details