తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వం మీద భారమున్నా... నెల నెల డబ్బులిచ్చాం'

నిరుపేదలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నా... రూ.1500 పేదల ఖాతాల్లో వేశారని వెల్లడించారు.

minister-gangula-kamalakar-about-government-on-corona-time-at-telangana-legislative-council
'ప్రభుత్వం మీద భారమున్నా... నిరుపేదలు బాధపడకూడదని'

By

Published : Sep 14, 2020, 11:38 AM IST

కరోనా సమయంలో కూలీలు, నిరుపేదలు ఇబ్బంది పడకూడదని... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి నెల 12 కిలోల బియ్యం అందించారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆర్థికంగా భారమున్నప్పటికీ... కూరగాయలు తెచ్చుకునేందుకు వీలుగా రూ.1500 వారి ఖాతాల్లో వేశారని తెలిపారు.

పేదవారికి ఇబ్బంది కలిగే విధంగా... కరోనా సమయంలో కూరగాయల రేట్లు పెంచారనే ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. చింతపండు తప్పా... మిగిలిన ఏ కూరగాయల, నిత్యవసరాల రేట్లు పెరగలేదని మంత్రి వెల్లడించారు. నిరుపేదలు బాధపడకూడదని చాలా మంచి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని గంగుల పేర్కొన్నారు.

'ప్రభుత్వం మీద భారమున్నా... నిరుపేదలు బాధపడకూడదని'

ఇదీ చూడండి:'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

ABOUT THE AUTHOR

...view details