జులై నెలాఖరు కల్లా మానేరు రివర్ ఫ్రంట్(Maneru River front) అభివృద్ధికి మాస్టర్ ప్లాన్, డీపీఆర్ సిద్ధం చేసి ఏడాదిలోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌లోని జలసౌధలో.. ప్రాజెక్టు అభివృద్ధిపై నీటి పారుదల శాఖ ఇంజినీర్లు, పర్యాటక శాఖ అధికారులు, సర్వే సంస్థ ప్రతినిధులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు.
సీఎం కేసీఆర్(Cm Kcr).. కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై(Karimnagar city Development) ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దాలని సంకల్పించారు. కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ప్రాజెక్టు కోసం ఇప్పటికే రెవెన్యూ సర్వే పూర్తయింది. భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.