తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంగన్​వాడీలకు పదోన్నతులు కల్పిస్తాం' - hyderabad latest updates

హైదరాబాద్ కమిషనరేట్​లో .. అంగన్​వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కమిషనర్ దివ్య పాల్గొన్నారు.

Minister for Women and Child Welfare Satyavati Rathore has said that the salaries of government employees as well as Anganwadi staff will be increased in the upcoming PRC
'అంగన్వాడీలకు పదోన్నతులు కల్పిస్తాం'

By

Published : Jan 18, 2021, 3:31 PM IST

రానున్న పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అంగన్​వాడీలకు, సిబ్బందికి జీతాలు పెరుగుతాయని స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు.

హైదరాబాద్ కమిషనరేట్​లో నిర్వహించిన అంగన్​వాడీలకు చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కమిషనర్ దివ్యతో కలిసి చీరలను పంపిణీ చేశారు.

పదోన్నతి కల్పిస్తాం..

ఈ నెలలో అంగన్​వాడీ టీచర్లకు పరీక్ష నిర్వహించి.. సూపర్ వైజర్లుగా పదోన్నతి కల్పిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సీఎం కేసీఆర్​కు అంగన్​వాడీ సేవలపై విశ్వాసం ఉందని.. భవిష్యత్తులో ఈ సేవలను విస్తరించే అవకాశం ఉందని వివరించారు.

'అంగన్​వాడీ టీచర్లు, సిబ్బందికి బీమా కల్పించే అంశంపై సమాలోచనలు జరుపుతున్నాం. అర్హుందరికి అంగన్వాడీ సేవలు అందాలి.'

-సత్యవతి రాథోడ్ , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

ఇదీ చదవండి:రైతుల ఐకాస​ నుంచి బీకేయూ నేత సస్పెన్షన్​

ABOUT THE AUTHOR

...view details