రాష్ట్రంలో జ్వరం వచ్చిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కరోనా టెస్టులు చేయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. వివిధ జిల్లాల వైద్యాధికారులతో మంత్రి ఈటల దృశ్యమాధ్యమ సమీక్ష జరిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ భయాన్ని అధిగమించామని ఈటల వెల్లడించారు.
గుర్తించి పరీక్షలు చేయించాలి.. అధికారులకు ఈటల ఆదేశం - Corona tests for those with fever
తెలంగాణలో జ్వరం వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. దృశ్యమాధ్యమ సమీక్షలో మంత్రి ఈటల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ భయాన్ని అధిగమించామని అన్నారు.
ఊపిరితిత్తులు దెబ్బ తిన్నవారిలో వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. వీలైనంత త్వరగా వైరస్ నిర్ధరణ చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూడవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. జ్వరం వచ్చిన వారిని... ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్లు గుర్తించి కొవిడ్ పరీక్షలు చేయించాలని సూచించారు. ఈటలతో దృశ్యమాధ్యమ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.. డాక్టర్ శ్రీనివాసరావు, కాళోజీ యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి సహా జిల్లాల వైద్య అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం చలనం లేదు : బండి సంజయ్