కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్లో మాట్లాడారు. కరోనా చికిత్సల్లో కీలక పాత్ర పోషించి... స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఈటల కోరారు. వైద్య విద్యార్థులు నిరంతరాయంగా కరోనా రోగులకు చికిత్స అందించారని వివరించారు.
వారి సేవలు ఎనలేనివి... ప్రమోట్ చేయండి: మంత్రి ఈటల - మంత్రి ఈటల రాజేందర్ వార్తలు
స్వల్ప మార్కుల తేడాతో ఫెయిల్ అయిన వైద్య విద్యార్థులను ప్రమోట్ చేయాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కు... మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో వారు చేసిన సేవలు ఎనలేనవని కొనియాడారు.
వాళ్లని ప్రమోట్ చేయండి... వారు చేసిన సేవలు ఎనలేనివి: ఈటల
ఈ ఏడాది వైద్య విద్య పీజీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు... ఫెయిల్ అయ్యారని... కరోనా కాలంలో రెగ్యులర్ తరగతులకు హాజరు కాలేకపోవడమే కారణమని వివరించారు. ఆ సమయంలో వారు కొవిడ్ రోగులకు.. ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని... స్వల్ప తేడాతో ఫెయిల్ అయిన వారిని పాస్ చేయాలని ఈటల కోరారు. ఈ ఏడాది పీజీ పరీక్షలకు... 1,040 మంది హాజరుకాగా.. వారిలో 100 మంది స్వల్ప తేడాతో ఫెయిల్ అయినట్లు సమాచారం.