కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో పేర్కొన్నారు. కొవిడ్ రోగుల చికిత్సకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా కరోనా వచ్చిన వారిలో వైరస్ తీవ్రతపై నివేదిక కోరామని స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా కరోనా కట్టడికి ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు.
కరోనా తీవ్రతపై నివేదిక కోరాం: మంత్రి ఈటల - assembly sessions 2021
తాజాగా కరోనా వచ్చిన వారిలో వైరస్ తీవ్రతపై నివేదిక కోరామని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు.
మంత్రి ఈటల రాజేందర్
కొద్ది రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి ఈటల తెలిపారు. కరోనా వార్డుల్లో ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పారు.