రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చడంతో.... ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మహమ్మారి కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నా... ప్రజల నిర్లక్ష్యంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
కొవిడ్ తీవ్రతపై మధ్యాహ్నం మంత్రి ఈటల సమీక్ష - minister etela review on corona
రాష్ట్రంలో కరోనా కట్టడిపై మంత్రి ఈటల రాజేందర్ నేడు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం నిర్వహించనున్నారు. సమీక్షకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు.
కొవిడ్‌పై మధ్యాహ్నం మంత్రి ఈటల సమీక్ష
ఇప్పటికే అధికారులతో సమీక్షించిన మంత్రి ఈటల రాజేందర్... కరోనా కట్టడిపై మధ్యాహ్నం రెండు గంటలకు... కోఠిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించనున్నారు. ఆ భేటీకి పలువురు వైద్యారోగ్యశాఖ అధికారులు హాజరుకానున్నారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఈటల అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఇదీ చూడండి :ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్