రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. ప్రస్తుతం రోగులకు అందిస్తున్న సేవలను ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాంధీ ఆస్పత్రిలో అకాడమిక్ బ్లాక్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 200 బెడ్స్‌ను పరిశీలించారు. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డా. రాజారావు, ఆర్ఎమ్ఓ శేషాద్రి, హెచ్ఓడీలు, అన్ని విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు.
గాంధీ ఆస్పత్రిలో సమస్యలపై మంత్రి ఈటల సమావేశం - గాంధీ ఆస్పత్రిలో ఇబ్బందులపై మంత్రి ఈటల భేటీ
గాంధీ ఆస్పత్రిలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి మంత్రి ఈటల రాజేందర్ గాంధీ ఆస్పత్రి వైద్యులు, అధికారులు, హెచ్ఓడీలతో భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 200 బెడ్స్‌ను పరిశీలించారు. పేషంట్ బెడ్ దగ్గరికి వైద్య సిబ్బంది వెళ్లకుండానే ఆరోగ్య పరిస్థితిని మోనిటర్ చేసే విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఆధునిక టెక్నాలజీనీ వాడుకునే ప్రయత్నం చేస్తూ రోగులకు చికిత్స అందించాలన్నారు.
ప్లాస్మా చికిత్స ద్వారా ఇప్పటికీ 13 మందికి ప్లాస్మా తెరపీ అందిస్తే 11 మంది బతికినట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో చికిత్స పొందుతున్న పేషంట్ల వివరాలు ఫోన్ ద్వారా వారి బంధువులకు అందించడానికి సమన్వయ కర్తలను నియమించాలని మంత్రి ఆదేశించారు. గాంధీలో ప్రతి రూంకి వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఫ్యాన్లు ఏర్పాటు చేసి గదుల్లో ఉన్న గాలి బయటికి పంపించే ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శానిటైసేషన్ సిబ్బంది తక్కువ చేసి మిషనరీ ద్వారా పరిశుభ్రం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని తెలిపారు. కేసులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా సిబ్బందిని పెంచుకోవాలన్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: కరోనాతో ప్రజలు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి?