కరోనా చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచాలని మంత్రి సూచించారు.
కరోనా తీవ్రతపై ఫోన్‌లో మంత్రి ఈటల ఆరా - minister etela rajender speech
కరోనా తీవ్రతపై మంత్రి ఈటల రాజేందర్ ఫోన్‌లో ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ, డీహెచ్‌తో మంత్రి మాట్లాడారు. కేసులు పెరుగుతున్నా... తీవ్రత లేదని మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు.
![కరోనా తీవ్రతపై ఫోన్‌లో మంత్రి ఈటల ఆరా minister etela rajender, minister etela rajender talk about corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11154110-921-11154110-1616669016983.jpg)
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలన్నారు. తదనుగుణంగా భవిష్యత్ ప్రణాళిక సిద్దం చేస్తామని మంత్రి ఈటల అధికారులకు వివరించారు. కరోనా కేసులు పెరుగుతుండగా.. పరిస్థితి ఎలా ఉందంటూ అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు... మంత్రి ఈటల రాజేందర్‌ను ఆరా తీశారు. తన ఛాంబర్ నుంచి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్ డాక్టర్ శ్రీనివాస్‌తోపాటు పలువురు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్య అసోషియేషన్‌లతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఇన్‌పెషెంట్ల సంఖ్య పెరగిందని.. తీవ్రత లేదని అధికారులు మంత్రికి వివరించారు.
- ఇదీ చూడండి:'ఆ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు'