తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి' - corona news in hyderabad

తెలంగాణలో కొవిడ్-19 వ్యాప్తి జరగలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు సూచించారు. అసెంబ్లీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన ఫోన్​లో మాట్లాడారు.

Etela
'కరోనా పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

By

Published : Mar 15, 2020, 11:48 PM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జరగకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. అసెంబ్లీ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్​ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావుతో ఆయన ఫోన్​లో మాట్లాడారు. విమానాశ్రయాన్ని దిగ్బంధం చేయాలని ఏ ఒక్కరిని పరీక్షించకుండా బయటికి పంపొద్దని మంత్రి ఈటల సూచించారు. కరోనా సందర్భంలోనే కాకుండా ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు గాంధీ, ఉస్మానియా, ఛాతీ, ఫీవర్ ఆసుపత్రులు సిద్ధంగా ఉంచాలన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. వారిలో ఒకరు ఇటలీ నుంచి, మరొకరు నెదర్లాండ్ నుంచి వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి జరగలేదని... రాపిడ్ యాక్షన్ టీమ్​లతో పాజిటివ్ వ్యక్తులు కలిసిన వారందరికీ పరీక్షలు చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:భారత్​లో 107కు చేరుకున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details