క్యాన్సర్ మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్యాన్సర్ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సదుపాయాలు కల్పించిందని తెలిపారు.
'క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి' - గ్రెస్ క్యాన్సర్ రన్ వార్తలు
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ... గ్రెస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ''గ్రెస్ క్యాన్సర్ రన్''ను గచ్చిబౌలిలో నిర్వహించనుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి సూచించారు.
'క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి'
గ్రెస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో... రొమ్ము క్యాన్సర్‌పై శనివారం గచ్చిబౌలిలో "గ్రెస్ క్యాన్సర్ రన్" పేరిట ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు. గ్లోబల్ వర్చువల్ ఆన్లైన్ వేదికగా గంటన్నర పాటు లక్ష మందికి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన అవసరం అని మంత్రి వెల్లడించారు. శనివారం జరగబోయే సదస్సుకు తాను హాజరుకానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని కోరారు.