తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె వైద్యులకే పట్టం కడతాం: ఈటల - health minister

గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి విముఖత చూపుతున్న వైద్యుల విషయంలో కఠింగా వ్యవహరిస్తామని ఆశాఖ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. మహాత్మాపూలే ఫౌండేషన్, ఎంబీసీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్స్​డే లో మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పల్లె వైద్యులకే పట్టం కడతాం: ఈటల

By

Published : Jul 3, 2019, 10:26 PM IST

నగరాల్లో పనిచేసే వారికంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వేతనాల పెంపు, పదోన్నతుల విషయంలోను గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వారికే మొదటి ప్రాధ్యానిస్తామన్నారు. రవీంద్రభారతిలో నిర్వహించిన డాక్టర్స్​డే వేడుకల్లో పాల్గొన్నారు. నేటి రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులకు మాత్రమే గుర్తింపు ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారంతా అణగారిన వర్గాలకు చెందినవారు ఎక్కువ ఉంటారని వారికి సేవ చేయడం వైద్యుల బాధ్యతని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో స్థిరపడి సమాజానికి సేవలు అందించిన వంద మంది వైద్యులను సత్కరించారు.

పల్లె వైద్యులకే పట్టం కడతాం: ఈటల
ఇదీ చూడండి: కాడిమోస్తూ వ్యవసాయం..దంపతుల గోస..

ABOUT THE AUTHOR

...view details