పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండడం అభినందనీయమని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళలను 'సూపర్ ఉమెన్ రోల్ మోడల్స్' అవార్డులతో ఘనంగా సన్మానించారు. జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా జాతీయ జెండా ఉత్సవాలు హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి.
100మంది మహిళలకు 'సూపర్ ఉమెన్ రోల్ మోడల్స్' అవార్డులు - గ్లోబల్ హ్యూమన్ రైట్స్ వార్తలు
జాతీయ జెండా ఆవిష్కరించి 100 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి ఈటల పాల్గొన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళలను ఘనంగా సన్మానించారు.
జాతీయ జెండా ఉత్సవాలు, గ్లోబల్ హ్యూమన్ రైట్స్, మంత్రి ఈటల రాజేందర్
గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని.. మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి:'మరో ఆర్నెళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి'