తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆస్పత్రుల్లో వసతులపై నివేదిక సిద్ధం చేయండి: మంత్రి ఈటల - వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్​ల ఏర్పాటు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోని సౌకర్యాలపై మంత్రి ఈటల.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం జరిపారు. అసెంబ్లీ వేదికగా పలు ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పని చేయడం లేదనే ఆరోపణలు వస్తున్న తరుణంలో.. వైద్య పరికరాల పని తీరుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

Minister etela directive to the authorities on facilities in health centers in telangana
ఆరోగ్య కేంద్రాల్లోని సౌకర్యాలపై అధికారులకు మంత్రి ఆదేశం

By

Published : Sep 10, 2020, 10:16 PM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్​ల ఏర్పాటు సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాల్లోని సౌకర్యాలపై మంత్రి ఈటల బీఆర్​కే భవన్​లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో 22 చోట్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్​లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు చోట్ల ఎల్ఓటీలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మిగతా ప్రాంతాల్లో సైతం వచ్చే రెండు నెలల్లో పూర్తి స్థాయిలో ఎల్ఓటీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుండటం వల్ల అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్య సదుపాయాలు కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో ఇటీవల కారోనా కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన మంత్రి.. జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలను సరిపడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీ వేదికగా పలు ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పని చేయడం లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. వైద్య పరికరాల పని తీరుపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. కేటీఆర్ పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 100 అంబులెన్స్​లను వైద్య ఆరోగ్య శాఖకు ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఈటల.. ఆయా అంబులన్స్​ల పూర్తి స్థాయి వినియోగానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు.

ఇదీ చూడండి :నాగులుతో ఫోన్​లో మాట్లాడిన మంత్రి ఈటల

ABOUT THE AUTHOR

...view details