కరోనా కట్టడిలో భాగంగా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. హైదరాబాద్ కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డీఎంఈ రమేశ్ రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సహా పలువురు హాజరయ్యారు.
అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం: ఈటల - హైదరాబాద్ జిల్లా తాజా వార్తలు
కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలను మంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. అందరం కలిసికట్టుగా పనిచేసి కరోనాను ఎదుర్కొందామని పేర్కొన్నారు. హైదరాబాద్ కోఠి కమాండ్ కంట్రోల్ రూమ్లో అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి సమీక్షించారు.
అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొందాం: ఈటల
కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలను మంత్రి ఈటల కొనియాడారు. ప్రతి వారం నేరుగా లేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి.. ఆయా ఆస్పత్రుల్లో పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి కరోనాను ఎదుర్కోవాలని మంత్రి పేర్కొన్నారు.
ఇది చదవండి:'రాష్ట్రంలో కరోనాతో ఎవరూ మరణించకూడదు.. అదే నా లక్ష్యం'