గ్రామీణ ప్రాంతాల్లోనూ 24గంటల కరెంట్ ఇవ్వడం వల్లే వ్యవసాయాధారిత పంటల ఉత్పత్తి పెరిగిందని శాసన మండలిలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో కొత్తగా 7 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయన్నారు. యువత కోసం అనేక స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్లో కేటాయింపులు సరిగాలేవని ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదని ఎమ్మెల్సీ రామచందర్ రావును ఉద్దేశించి మంత్రి అన్నారు.
'విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించాం'
ప్రభుత్వం విద్యా రంగానికి సరిపడా బడ్జెట్ కేటాయించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులపై ఎమ్మెల్సీ రామచందర్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదు: మంత్రి ఈటల
విద్యారంగానికి కేవలం 6.6 శాతం బడ్జెట్ కేటాయించారని ఎమ్మెల్సీ రామచందర్ రావు ఆక్షేపించారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలని కోరారు.
ఇదీ చూడండి:మరింత తగ్గిన చమురు ధర- వారిద్దరి మధ్య యుద్ధమే కారణం!