చెరువులను ఎప్పటికప్పుడు బాగుచేసుకోవాలని... సూచించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. చెరువు కన్న తల్లితో సమానమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో కోర్వి కృష్ట స్వామి 126వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ముదిరాజ్ జడ్పీటీసి, ఎంపీటీసీ, సర్పంచ్‌లను ఈటల ఘనంగా సన్మానించారు. ఈటలతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, ముదిరాజ్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
'వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - వార్డు మెంబర్లు
బంగారు తెలంగాణ సాధించాలంటే ఎంపీ, ఎమ్మెల్యేలతోనే సాధ్యం కాదని.. వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు కష్టపడి పని చేసినప్పుడే అది సాధ్యమవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
'వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'