తెలంగాణ

telangana

దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో ఆసరా పింఛన్లు: ఎర్రబెల్లి

By

Published : Mar 22, 2021, 10:53 AM IST

రాష్ట్రంలో 39,36,521 మందికి పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. కొత్తవాళ్లకు కూడా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆసరా ఫించన్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

ఏ రాష్ట్రంలోనూ లేనంతగా పింఛన్ల పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి
ఏ రాష్ట్రంలోనూ లేనంతగా పింఛన్ల పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనసభకు వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో వయసుతో పాటు అనేక నిబంధనలు పెట్టినా 750 రూపాయలకు మించడం లేదని తెలిపారు.

కేంద్రం ప్రభుత్వం ఇస్తున్నది ఏడాదికి కేవలం రూ.210 కోట్లు మాత్రమేనని... అందులోనూ 6 లక్షల మందికే వర్తిస్తోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం.. రూ.11,724,70 లక్షలు ఖర్చు చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో 39,36,521 మందికి పింఛన్లు అందజేస్తున్నామని వివరించిన మంత్రి.. కొత్తవాళ్లకు కూడా ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు.

ఏ రాష్ట్రంలోనూ లేనంతగా పింఛన్ల పంపిణీ: మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చూడండి:మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు

ABOUT THE AUTHOR

...view details