రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావాలని, నల్లా లేని ఇళ్లు రాష్ట్రంలో ఒక్కటి కూడా ఉండొద్దని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అధికారులు, ఇంజినీర్లతో సమావేశమైన మంత్రి.. మిషన్ భగీరథ పురోగతిపై సమీక్షించారు.
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ శుద్ధి చేసిన మంచినీరు అందినప్పుడే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వప్నం సాకారం అవుతుందని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న స్థిరీకరణ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆశించిన మేర స్థిరీకరణ జరగని జిల్లాలపై చీఫ్ ఇంజినీర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.