ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి అన్నారు. హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటామన్నారు. కేంద్రం మేము అడిగిన నిధులను ఇవ్వలేదన్నారు.
కేంద్రం మేము అడిగిన నిధులు ఇవ్వలేదు: ఎర్రబెల్లి - Minister Errabelli Dayakar Rao latest news
ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ ముందు స్థానంలో నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. గ్రామాల్లో కరోనా పెషంట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్థానిక అధికారులకు తెలిపామన్నారు.
![కేంద్రం మేము అడిగిన నిధులు ఇవ్వలేదు: ఎర్రబెల్లి minister errabelli review meeting at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365834-258-8365834-1597055144739.jpg)
కేంద్రం మేము అడిగిన నిధులు ఇవ్వలేదు: ఎర్రబెల్లి
మహిళా సంఘాలకు అత్యధికంగా రుణాలు ఇచ్చింది తెలంగాణే అని దయాకర్ రావు చెప్పారు. దసరా నాటికి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు. గ్రామాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీని దాదాపు పూర్తిచేశామని వెల్లడించారు. హరతహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. కొత్తగా గ్రామ పంచాయతీ భవనాలు కూడా నిర్మిస్తున్నామని వివరించారు.
కేంద్రం మేము అడిగిన నిధులు ఇవ్వలేదు: ఎర్రబెల్లి
ఇదీ చూడండి :వర్చువల్ డ్రైవింగ్ స్టిములేటింగ్ యంత్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ