లాక్డౌన్ వేళ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుటుంబ సభ్యులతో గడిపారు. హైదరాబాద్లోని తన నివాసంలో సరదాగా ఆటలు ఆడారు. గతంలో టేబుల్ టెన్నిస్ ఆడిన ఎర్రబెల్లి... తాజాగా క్యారమ్స్ ఆడారు. లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులతో గడిపేందుకు కాస్త సమయం దొరికిందన్నారు.
కుటుంబసభ్యులతో ఆడుకున్న మంత్రి ఎర్రబెల్లి - lock down time
లాక్డౌన్ సమయాన్ని అందరూ కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ జాబితాలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సైతం వచ్చేశారు. పిల్లలతో కలిసి గతంలోనూ సరదాగా ఆటలు ఆడిన మంత్రి... మరోసారి క్యారమ్స్ ఆడుతూ సమయాన్ని ఆనందంగా గడిపారు.
![కుటుంబసభ్యులతో ఆడుకున్న మంత్రి ఎర్రబెల్లి minister errabelli played caroms with his family members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7098435-1106-7098435-1588843622096.jpg)
కుటుంబసభ్యులతో ఆడుకున్న మంత్రి ఎర్రబెల్లి
ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ దుర్వినియోగం చేసుకోవద్దన్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటిస్తూ... కుటుంబసభ్యులతో హాయిగా గడపాలని ఎర్రబెల్లి సూచించారు. త్వరలోనే రాష్ట్రం కరోనారహితంగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.