ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రాష్ట్రానికి మంజూరైన రహదారులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి... పీఎంజీఎస్వై పనుల పురోగతిని సమీక్షించారు. రాష్ట్రానికి మంజూరైన 158 రోడ్ల పనుల పురోగతిని తెలుసుకుని పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
రహదారుల నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం - పీఎంజీఎస్వై పనులపై మంత్రి ఎర్రబెల్లి సమావేశం
పీఎంజీఎస్వై పనుల పురోగతి గురించి ఇంజినీరింగ్ శాఖ అధికారులతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమీక్షించారు. రాష్ట్రానికి మంజూరైన రహదార్లను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.
![రహదారుల నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం minister errabelli meeting on road construction at hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8365151-424-8365151-1597052389583.jpg)
రహదారుల నిర్మాణంపై మంత్రి ఎర్రబెల్లి సమీక్షా సమావేశం
రోడ్డు నిర్మాణం పనుల్లో రాజీపడవద్దని మంత్రి స్పష్టం చేశారు. నిబంధనలకు లోబడి ఉన్న పనులను మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలని, ఇబ్బందులు ఉన్న వాటిని రెండో ప్రాధాన్యంగా తీసుకుని సమస్యలు పరిష్కరిస్తూ పూర్తి చేయాలన్నారు. ఆయా పనులను ఉన్నతాధికారులు స్వయంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.