సీఎం కేసీఆర్ పల్లె ప్రగతిని ప్రవేశపెట్టిన తరువాతే గ్రామ పంచాయతీల రూపురేఖలు మారాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులు, సిబ్బందికి ఆయన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నూతన పంచాయతీరాజ్ చట్టంతో గ్రామ పంచాయతీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు. అనేక సంస్కరణలు, నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు మొదలయ్యాయన్నారు. కల్లాలు, రైతు వేదికలు వచ్చాయని తెలిపారు. క్రమం తప్పకుండా ప్రతి నెలా రు.308 కోట్ల నిధులను పంచాయతీలకు అందజేస్తున్నామని... కొత్తగా 3,146 తండాలు పంచాయతీలు అయ్యాయని స్పష్టం చేశారు.