తెలంగాణ

telangana

ETV Bharat / state

Minister Errabelli: అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి - Minister Errabelli in Annavaram temple

ఆంధ్రప్రదేశ్​లో సుప్రసిద్ధ క్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు పండితులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Minister Errabelli
Minister Errabelli

By

Published : Oct 10, 2021, 4:42 PM IST

ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ఛైర్మన్ రోహిత్ స్వామి మంత్రి ఎర్రబెల్లిని శాలువాతో సత్కరించారు. ఆంధ్రా, తెలంగాణ ప్రజలు ఆయురారోగ్యాలతో... సంతోషంగా ఉండాలని సత్యనారాయణ స్వామిని ప్రార్థించినట్లు ఎర్రబెల్లి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details