ఉపాధిహామీ (MGNREGA) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా ఉన్న 13కోట్లలో... ఇప్పటికే 9 కోట్ల 80 లక్షల పనిదినాలు కల్పించామని మంత్రి తెలిపారు. గతేడాది ఈ సీజన్‌లో 17 లక్షల 50 వేల మంది కూలీలు పనిచేస్తే ప్రస్తుతం ఇప్పటికే 25 లక్షల 79 మంది పనిచేశారని వివరించారు. కొవిడ్(Corona) కష్టకాలంలో నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. ఉపాధిహామీ పథకం అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్న అధికారులు, ఉద్యోగులను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.
వచ్చే 15 రోజులు పని చూపండి
కొవిడ్ విజృంభణ, లాక్డౌన్ కారణంగా చాలా మంది పట్టణాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని, వారందరికీ జాబ్ కార్డులిచ్చి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న 15 రోజుల్లో ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రధాన పంట కాల్వలు, ఫీల్డ్ ఛానల్స్ పూడికతీతను వర్షాకాలం ముందే పూర్తి చేయాలని చెప్పారు.
జ్వర సర్వేలో చురుగ్గా పాల్గోవాలి