తెలంగాణ

telangana

ETV Bharat / state

'అడిగినోళ్లందరికీ 'ఉపాధి హామీ' కల్పించిన ఘనత మాదే'

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ పని కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని మంత్రి పేర్కొన్నారు.

'అడిగిన వారందరికీ ఉపాధిహామీ పని కల్పించిన ఘనత తెలంగాణదే'
'అడిగిన వారందరికీ ఉపాధిహామీ పని కల్పించిన ఘనత తెలంగాణదే'

By

Published : Feb 2, 2021, 8:01 PM IST

అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధిహామీ పని కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉపాధి హామీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ క్యాలెండర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. కరోనా సమయంలో నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వారందరికీ ఉపాధి కల్పించడం ఓ రికార్డన్న ఎర్రబెల్లి.. లక్షలాది మందికి నూతన జాబ్ కార్డులు ఇచ్చినట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధి హమీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని అధికారులు, ఉద్యోగులు కొనసాగించాలని మంత్రి కోరారు. గతంలో కొద్ది మందికి మాత్రమే ఉపాధి దక్కేదని.. అవి ఉపయోగపడే పనులు కావని అన్నారు. కానీ, ఇపుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్పాదక రంగాలు, వ్యవసాయం, కాలువలు, రహదార్ల వంటి ఉపయోగపడే పనులు జరిగాయని తెలిపారు.

'అడిగిన వారందరికీ ఉపాధిహామీ పని కల్పించిన ఘనత తెలంగాణదే'

ఇదీ చదవండి: వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి : హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details