తెలంగాణ

telangana

ETV Bharat / state

ERRABELLI: 'పింఛన్​ కోసం అర్హులందరూ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి' - తెలంగాణ వార్తలు

వృద్ధాప్య పించన్​కు అర్హులైన వారు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు సూచించారు. దరఖాస్తులకు ఈ సేవా, మీ సేవాల్లో సేవా రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన తెలిపారు.

ERRABELLI: 'పింఛన్​కు అర్హులైన వారు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి'
ERRABELLI: 'పింఛన్​కు అర్హులైన వారు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి'

By

Published : Aug 14, 2021, 4:02 PM IST

వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో అర్హులు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. అర్హులైన వారు తక్షణమే ఈ-సేవా, మీ-సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని ఆయనన్నారు.

ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులకు ఈ సేవా, మీ సేవాల్లో సేవా రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములు ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

నెలాఖరు వరకు గడువు

వృద్ధాప్య పింఛన్ల కనీస అర్హత వయస్సును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో అర్హులను గుర్తించి వీలైనంత త్వరగా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆదేశించింది. అందుకు అనుగుణంగా కొత్త లబ్ధిదారుల ఎంపిక కసరత్తును గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ప్రారంభించింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

57 ఏళ్లు నిండిన వారు ఆసరా పింఛన్​ కోసం మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నిర్ణీత నమానాలోని దరఖాస్తు పత్రంలో పేరు, వివరాలు, ఆధార్ సంఖ్య, అందులోని పుట్టినతేదీ, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ నంబర్ పేర్కొనాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును కూడా జతపర్చాల్సి ఉంటుంది. మీ-సేవ, ఈ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్​కు ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం నెలాఖరు వరకు గడువిచ్చింది.

ఇదీ చదవండి: నెలాఖరు వరకు వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ

ABOUT THE AUTHOR

...view details