రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల 80 వేల స్వయంసహాయక సంఘాలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ - (సెర్ప్) ద్వారా 12,070 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించనునట్లు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) తెలిపారు. అందులో భాగంగా గత నెలాఖరు వరకు 4,833 స్వయం సహాయక సంఘాలకు 168 కోట్ల 81 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కల్పించామని వివరించారు. మిగిలిన గ్రూపులకు త్వరలోనే బ్యాంకు లింకు చేస్తామన్నారు.
రాష్ట్రంలో సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాలకు గత ఏడేళ్ల కాలంలో 44,270 కోట్లు రూపాయలు బ్యాంకు లింకేజీ కల్పించామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో మూడు లక్షల 60వేల ఎస్ హెచ్జీలు ఉండగా... గత ఏడేళ్లలో 78,458 సంఘాలను కొత్తగా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.