తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​లో ఇప్పటివరకు 60 వేల కోట్ల అభివృద్ధి పనులు' - మంత్రి ఎర్రబల్లి దయాకర్​ రావు వార్తలు హైదరాబాద్​

హైదరాబాద్​లో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి గెలుద్దామని భాజపా అనుకుంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు విమర్శించారు. వరద సహాయం కూడా ఇవ్వొద్దని చెప్పి ఇప్పుడు తాము చెప్పలేదని భాజపా నాయకులు బుకాయిస్తున్నారని ఆరోపించారు.

'హైదరాబాద్​లో ఇప్పటివరకు 60 వేల కోట్ల అభివృద్ధి పనులు'
'హైదరాబాద్​లో ఇప్పటివరకు 60 వేల కోట్ల అభివృద్ధి పనులు'

By

Published : Nov 21, 2020, 9:51 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కాప్రా ఒకటో డివిజన్​లో తెరాస అభ్యర్థి స్వర్ణరాజు తరఫున కాప్రా సర్కిల్​ ఇంఛార్జ్​, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. హైదరాబాద్​లో హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి గెలుద్దామని భాజపా అనుకుంటుందని విమర్శించారు. వరద సహాయం కూడా ఇవ్వొద్దని చెప్పి ఇప్పుడు తాము చెప్పలేదని నాయకులు బుకాయిస్తున్నారని ఆరోపించారు.

హైదరాబాద్​లో ఇప్పటివరకు తెరాస ప్రభుత్వం రూ.60 వెల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసిందన్నారు. కాప్రా డివిజన్ అభివృద్ధి కోసం రూ.వంద కోట్లు ఇస్తామని సీఎంతో హామీ ఇప్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కొనియాడారు. తెరాస ప్రభుత్వం చేసిన మంచి పనుల వల్ల మళ్లీ తానే గెలుస్తానని అభ్యర్థి స్వర్ణరాజు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:మీరు పైసా ఇవ్వకున్నా... మేం ఎంతో చేశాం: కేటీఆర్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details