పల్లెల అభివృద్ధికి నిధులు సరిపడా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పనుల్లో అలక్ష్యం వహించవద్దని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కొందరు అద్భుతంగా పనిచేయడం వల్ల గ్రామా రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు.
'పదేపదే కోరినా కేంద్రం స్పందించడం లేదు' - ఉపాధిహామీ పథకంపై మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్య
పనుల్లో అలక్ష్యం వహించే ప్రజాప్రతినిధులు, అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించాలని పదేపదే కోరినా కేంద్రం స్పందించడం లేదని మంత్రి ఆరోపించారు. వివిధ శాఖల ద్వారా పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామంటున్న మంత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'పదేపదే కోరినా కేంద్రం స్పందించడం లేదు'
'పదేపదే కోరినా కేంద్రం స్పందించడం లేదు'
కేంద్రం ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానించాలని పదేపదే కోరినా కేంద్రం స్పందించడం లేదని దయాకర్ రావు అన్నారు. నిబంధనల మేరకు వీలైనంత ఎక్కువగా సద్వినియోగం చేసుకునేలా వివిధశాఖల్లో ఉపాధిహామీ ద్వారా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి :చైనా కంపెనీతో రైల్వే కాంట్రాక్ట్ రద్దు!