కొవిడ్ కారణంగా 81వ నుమాయిష్ వాయిదా వేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కేంద్రం నిబంధనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలు జనవరి 31 వరకు అమల్లో ఉన్నాయన్న ఈటల... మొదటి దశ కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. రాష్ట్రంలో కరోనా రెండో దశ లేదని స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్‌పై అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
నుమాయిష్ వాయిదా... కొవిడ్ నిబంధనలే కారణం - ఈటల రాజేందర్
కేంద్రం నిబంధనల మేరకు నుమాయిష్ వాయిదా వేసినట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి దశ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని... తెలంగాణలో కరోనా రెండో దశ లేదని మంత్రి తెలిపారు.
నుమాయిష్ వాయిదా... కొవిడ్ నిబంధనలే కారణం