హైదరాబాద్ నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై విచారణ కమిటీ వేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తప్పు చేసిన వారిని సస్పండ్ చేస్తామన్నారు. నిలోఫర్లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి పరామర్శించారు. పిల్లల ఆరోగ్యంపై వాకబు చేశానని.. 12 గంటలు గమనించిన తర్వాత వైద్యలు డిశ్చార్జ్ చేస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకకుండా.. వైద్యుల పర్యవేక్షణలోనే వ్యాక్సిన్ను అందించేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈటల పరామర్శ - నాంపల్లి ఏరియా ఆస్పత్రి
హైదరాబాద్ నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారులను ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. పిల్లల ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు.
ఈటల పరామర్శ