గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్‌కు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ అని మంత్రి ఈటల అన్నారు. ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న క్రమంలో దేశంలో అంతరాలు అంతం అవుతాయన్నారు. అంబేడ్కర్ కుల రహిత, మత రహిత, లౌకిక రాజ్యం ఏర్పడుతుందని... దేశంలో ఉన్న పేదరికం పోతుందని కలలు కని గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించారని పేర్కొన్నారు.
'గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్' - telangana news
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మంత్రి ఈటల రాజేందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంబేడ్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదని మంత్రి తెలిపారు. స్వేచ్ఛతో కూడిన గొప్ప ప్రజాస్వామిక దేశం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
'గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్'
స్వతంత్ర భారతదేశంలో అనేక మార్పులు జరిగాయని... కానీ అంబేడ్కర్ కలలు కన్న దేశం ఇంకా రాలేదన్నారు. పేదరికం, అంతరాలు పోయి... స్వేచ్ఛతో కూడిన గొప్ప ప్రజాస్వామిక దేశం కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
ఇదీ చదవండి: కనీవినీ ఎరుగని పథకాలతో.. దేశంలో అగ్రగామిగా తెలంగాణ