ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. స్వాస్త్వ క్యాన్సర్ కేర్, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా, స్కోప్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ధూమపానం వల్ల ఆరోగ్యానికి కలిగే సమస్యల గురించి వివరించారు. పొగాకును వ్యతిరేకిస్తూ మంత్రి ఈటల ఓ పోస్టర్ విడుదల చేశారు. పొగ తాగడం అభివృద్ధికి ఆటంకమని, ఆరోగ్యానికి పరోక్ష శత్రువుగా ధూమపానాన్ని అభివర్ణించారు. తొలిదశలోవే క్యాన్సర్ని గుర్తిస్తే దానిని ఎలా బయటపడాలి వంటి అంశాల గురించి కూడా కార్యక్రమంలో వివరించారు.
'ధూమపానంపై కూడా ఉక్కుపాదం మోపుతాం'
పొగాకును వివిధ రూపాల్లో తాగడం చాలా బాధాకరమన్నారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ధూమపానం సేవించి రోగాలు తెచ్చుకోవడం వల్ల కుటుంబంపైనే కాదు సమాజం పైన కూడా ప్రభావం పడుతుందని తెలిపారు.
'ధూమపానంపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది'