హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏటా నిర్వహించే అఖిల భారతీయ పారిశ్రామిక వస్తు ప్రదర్శన(నుమాయిష్) జనవరి 1న ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.3కోట్లతో రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అగ్నిమాపక వాహనాలు సహా అండర్‌గ్రౌండ్ కేబుల్ వ్యవస్థనూ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందించేలా శిక్షణ పొందిన 40 మందిని నియమించామని తెలిపారు.
జనవరి 1నుంచే నుమాయిష్: ఈటల రాజేందర్ - industrial exhibition at nampally
నుమాయిష్ జనవరి 1న ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గతేడాది చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు.
జనవరి 1నుంచే నుమాయిష్: ఈటల రాజేందర్
ఏటా ఎగ్జిబిషన్‌ను సందర్శించడానికి 20 లక్షల మంది వస్తున్నారని, వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 18 విద్యాసంస్థలకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు.
ఇవీ చూడండి: ఆయుర్వేద వైద్యం వైపు మళ్లీ మక్కువ : మంత్రి ఈటల
Last Updated : Dec 30, 2019, 7:31 AM IST