స్వైన్‌ఫ్లూ సమయంలో ఎలా అయితే చర్యలు తీసుకున్నామో... ఇప్పుడు కరోనా వైరస్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దని కోరారు. సమ్మక్క జాతర సందర్భంగా 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర సందర్భంగా 108 అంబులెన్స్‌లు, మొబైల్ అంబులెన్స్‌లు ఏర్పాటు చేశామని వివరించారు.
అసత్య ప్రచారాలు చేయొద్దు: ఈటల
కరోనా వైరస్‌పై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురిచేయొద్దని మంత్రి ఈటల కోరారు. స్వైన్‌ఫ్లూ సమయంలో తీసుకున్నట్లే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అసత్య ప్రచారాలు చేయొద్దు: ఈటల
మేడారం పరిసరాల్లోని అన్ని అసుపత్రుల్లో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యకర పరిసరాల విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి:అనుమతి ఇవ్వమంటే.. చెప్పుతో కొట్టిన అధికారిణి